TCS NQT 2025: మీ ఫస్ట్ జాబ్ కోసం ఛాన్స్ – ఫ్రీగా అప్లై చేసుకోండి | IT & Non-IT ఉద్యోగాలు


💼 ఫస్ట్ జాబ్ అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యమైందీ?

ప్రతి విద్యార్థి డిగ్రీ పూర్తి చేసిన తరువాత ముందుగా కోరుకునే లక్ష్యం – ఒక మంచి కంపెనీలో ఫస్ట్ జాబ్ పొందడం. ఈ ఫస్ట్ జాబ్ మీ కెరీర్‌కు బలమైన పునాది వేస్తుంది. మీరు ఇంజనీరింగ్, డిగ్రీ లేదా ఎమికైనా చదివి ఉంటే – ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది – TCS NQT 2025 ద్వారా!



🆓 అప్లికేషన్ ఫీజు లేదు – ఇది పూర్తిగా ఫ్రీ

చాలా మంది అభ్యర్థులు ఉద్యోగ పరీక్షలు ఫీజులు వల్ల దూరంగా ఉంటారు. కానీ TCS National Qualifier Test (NQT) 2025 కి మీరు ఏ ఫీజూ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు ఒక బహుళ జాబ్ అవకాశాలు తెచ్చిపెడుతుంది – IT మరియు Non-IT రంగాల్లో.



📝 అప్లికేషన్ ప్రక్రియ ఎలా?

1. TCS NQT అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి – https://www.tcsion.com

2. “Apply Now” బటన్ పై క్లిక్ చేయండి

3. మీ వివరాలు సరిగ్గా ఫిల్ చేయండి

4. మీ విద్యా వివరాలు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి

5. Submit చేసిన తరువాత మీకు confirmation మెయిల్ వస్తుంది



📅 ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి

Event తేదీ

  • అప్లికేషన్ చివరి తేదీ 24th June 2025
  • ఎగ్జామ్ తేదీ 6th July 2025
  • ఈ తేదీలను తప్పకుండా గమనించండి. చివరి నిమిషంలో అప్లై చేయడం వల్ల server errors, miss అవుతుండవచ్చు


TCS NQT కి డాక్యుమెంట్స్ కావాలా?


  • TCS team స్పష్టంగా ఏ డాక్యుమెంట్స్ అనేది చెప్పలేదు. కానీ క్రింద తెలిపినవన్నీ రేడీగా ఉంచుకోండి:
  • అడ్మిట్ కార్డ్ (ఎగ్జామ్ కి ముందు ఇచ్చేవారు)
  • విద్యా సర్టిఫికేట్లు (10వ తరగతి నుండి మీ లేటెస్ట్ డిగ్రీ వరకు)
  • ఒక govt ID proof (Aadhar/PAN/Voter ID)
  • Updated Resume



🧠 మీరు అడిగే 5-6 ప్రధాన ప్రశ్నలు


1️⃣ TCS NQT ఎవరైనా రాయచ్చా?

అవును. మీరు ఏ డిగ్రీ అయినా చేసినా, మీరు fresher అయితే రాయచ్చు.

👉 B.Sc, B.Com, B.Tech, MBA, Diploma – అన్నీ ok.



2️⃣ TCS NQT రాసిన తర్వాత ఏం జరుగుతుంది?

మీకు ఒక Scorecard వస్తుంది. దీన్ని మీరు వివిధ కంపెనీలకు పంపొచ్చు.

మీ స్కోరు ఆధారంగా కొందరు నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు.



3️⃣ Scorecard ఎన్ని రోజుల వరకూ valid ఉంటుంది?

👉 ఇది 2 సంవత్సరాల పాటు వాలిడ్ ఉంటుంది. అంటే ఒకసారి TCS NQT రాసి, స్కోర్ వస్తే – మీరు ఆ స్కోర్ తో 2 సంవత్సరాలపాటు jobs apply చేయవచ్చు.



4️⃣ ఈ స్కోర్ తో ఎక్కడెక్కడ apply చేయవచ్చు?

TCS

Tata group of companies

Other private companies (IT & Non-IT)

Govt projects లో భాగంగా కూడా కొన్ని సంస్థలు accept చేస్తాయి.



5️⃣ Technical ఉన్నవాళ్లే తప్పకా? Non-IT వాళ్లు apply చేయచ్చా?

👉 పూర్తిగా కాదు!

Non-IT విద్యార్థులు కూడా apply చేయవచ్చు. TCS NQT అన్నది basic communication, logical reasoning, numerical ability ఆధారంగా ఉంటుంది. So background matter కాదు – preparation matter!



6️⃣ ఎగ్జామ్ format ఏంటి?

  • TCS NQT లో వచ్చే సెక్షన్లు:
  • Verbal Ability
  • Reasoning Ability
  • Numerical Aptitude
  • Optional (Programming or Domain Test)
  • ఎవరైతే Programming select చేస్తారో – వాళ్ళకు కోడింగ్ బేస్డ్ questions వస్తాయి.



📊 TCS గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

వివరాలు వివరాలు

Company Name Tata Consultancy Services (TCS)

Headquarters Mumbai, India

Established Year 1968

Employees 6 Lakhs + (2025 వరకు)

Services IT Services, Consulting, Business Solutions

Work Locations India, USA, UK, Canada, Gulf countries



📢 చివరి మాటగా...

> మీ ఫస్ట్ జాబ్ కోసం ఎంతో మందికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటిది.

No fees, No restrictions – Just one good try.

TCS NQT 2025 ద్వారా మీరు మొదటి అడుగు వేయండి.

Apply చేయడానికి ఇంకా ఆలస్యం చేయకండి. దయచేసి అన్ని స్టెప్స్ complete చేయండి.


👉 Ready to Apply? Visit Official Site:

🔗 https://www.tcsion.com


Post a Comment

Previous Post Next Post