ఏపీ జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం APPLY NOW


Ap District Court jobs 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా న్యాయస్థానాల్లో వివిధ పోస్టుల భర్తీకి 1,620 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు. దరఖాస్తు తేదీలు 2025 మే 13 నుంచి జూన్ 2 వరకు అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం ఖాళీలు & పోస్టులు:

అధికారిక నోటిఫికేషన్లు విడుదల

AP హైకోర్టు Advt No. 1/2025 నుండి 10/2025 వరకు మొత్తం 1600కి పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు మే 6, 2025 న విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత PDFs‌ను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీలు (Estimated Vacancies)

పోస్టు పేరుఖాళీల సంఖ్య
Office Subordinate651
Junior Assistant230
Typist162
Stenographer Grade III80
Field Assistant56
Examiner32
Copyist194
Process Server164
Driver (Light Vehicle)28
Record Assistant24
మొత్తం1,621

జీతభత్యాల సమాచారం (Pay Scale)

పోస్టు పేరుజీత భత్యాలు
Office Subordinate₹21,000 – ₹61,960
Junior Assistant₹25,220 – ₹80,910
Typist₹25,220 – ₹80,910
Stenographer Grade III₹34,580 – ₹1,07,210
Field Assistant₹25,220 – ₹80,910
Examiner₹23,780 – ₹76,730
Copyist₹23,780 – ₹76,730
Process Server₹23,780 – ₹76,730
Driver (Light Vehicle)₹23,780 – ₹76,730
Record Assistant₹23,120 – ₹74,770

అర్హత ప్రమాణాలు

విద్యార్హత:

  • ఆఫీస్ సబార్డినేట్: కనీసం 7వ తరగతి పాస్
  • జూనియర్/ఫీల్డ్ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణత
  • టైపిస్ట్, స్టెనో: డిగ్రీ + టైపింగ్/స్టెనో సర్టిఫికేట్ (హయ్యర్ గ్రేడ్)
  • కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ పాస్
  • డ్రైవర్: 7వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్

వయో పరిమితి:
2025 జూలై 1నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ క్యాటగిరీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో విరామం వర్తిస్తుంది.

Also Read: Ap DSC Updates


ప్రధాన తేదీలు


దరఖాస్తు ఫీజు

  • జనరల్ / BC / EWS: ₹800
  • SC / ST / వికలాంగులు: ₹400

ఫీజు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాలి.


ఎంపిక ప్రక్రియ

  1. పరిమాన పరీక్ష (Written Test)
  2. నైపుణ్య పరీక్షలు (టైపింగ్ / స్టెనో / డ్రైవింగ్ - సంబంధిత పోస్టులకు)
  3. సర్టిఫికెట్ ధృవీకరణ

దరఖాస్తు విధానం

  1. అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in ను సందర్శించండి
  2. రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లోని సంబంధిత నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి
  3. కొత్తగా రిజిస్టర్ చేసుకోండి
  4. వ్యక్తిగత మరియు విద్యా వివరాలు పూర్తి చేయండి
  5. అవసరమైన సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
  6. ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించండి
  7. కాపీని సేవ్ చేసుకుని భవిష్యత్తులో ఉపయోగించుకోండి

ఏపీ జిల్లాల న్యాయ వ్యవస్థలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. కనీసం 7వ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు వరకూ అందరికీ ఉపయుక్తమైన పోస్టులు ఉన్నాయి. జూన్ 2 లోపు తప్పక దరఖాస్తు చేయండి.


Label: AP Jobs 2025, District Court Recruitment, APHC Jobs, Govt Jobs in Telugu

Post a Comment

Previous Post Next Post